అందుకే అతనికి పడిపోయా అంటున్న రకుల్‌ ప్రీత్‌!

Sunday, December 22, 2024
అందుకే అతనికి పడిపోయా అంటున్న రకుల్‌ ప్రీత్‌!

యంగ్ బ్యూటీ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కొద్ది రోజుల క్రితం బాలీవుడ్‌ నిర్మాత  జాకీ భగ్నానీని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వివాహం అయిన తరువాత రకుల్ మొదటి సారి మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది. ఈ క్రమంలో తన భర్త గురించి కొన్ని ఆసక్తికర విషయాలను రకుల్‌ అభిమానులతో పంచుకుంది.

ఈ సందర్భంగా రకుల్ తన భర్తను పొగడ్తలతో ముంచెత్తింది. జాకీ మంచి మనసు ఉన్న వ్యక్తి. అతనిలోని కామెడీ టైమింగ్‌ అంటే నాకు చాలా ఇష్టం. ఆ టైమింగే నన్ను పడిపోయేలా చేసిందంటూ రకుల్‌ చెప్పుకొచ్చింది. ఎప్పుడూ చూసినా సరదాగా ఉంటాడని..తన చుట్టూ ఉన్న వాళ్లని కూడా ఎప్పుడూ సంతోషంగా ఉండేలా చూస్తాడని రకుల్‌ చెప్పుకొచ్చింది.

నిజంగా ఇలాంటి వ్యక్తి నాకు భర్త గా దొరకడం నేను అదృష్టంగా భావిస్తున్నా అంటూ జాకీ భగ్నానీ పొగడ్తలతో ముంచెత్తింది. కామన్‌ ఫ్రెండ్స్‌ వల్ల జాకీ తో పరిచయమైనట్లు తెలిపింది. మూడు సంవత్సరాలు ప్రేమించుకున్న తరువాత ఫిబ్రవరి 21న వీరి పెళ్లి జరిగింది. గోవాలో అత్యంత సన్నిహితుల మధ్యన వీరి వివాహం జరిగింది.

ఈ క్రమంలోనే రకుల్‌ తన తల్లిదండ్రుల గురించి ప్రస్తావించింది. మా అమ్మనాన్నల ప్రోత్సాహామే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టటింది. నాలోని నటిని గుర్తించి నేను నటించగలను అని నమ్మింది మాత్రం మా అమ్మే. అందుకే కుటుంబ నేపథ్యం వేరైనా సినీ పరిశ్రమలో అడుగుపెట్టేందుకు ఎవరినీ ఒప్పించాల్సిన అవసరం రాలేదని రకుల్‌ చెప్పుకొచ్చింది.

మా నాన్న కూడా ఈ విషయంలో ఎంతో సపోర్ట్‌ ఇచ్చారు. వారు ఎప్పుడూ కూడా అమ్మాయి, అబ్బాయనే భేదాన్ని చూపించలేదు. మీరు ఏ విషయాన్ని నమ్మితే ఆ విషయాన్నే నమ్మండి..చేయండి అందులో విజయం సాధించండి అని మాత్రమే చెప్పేవారు.

తల్లిదండ్రుల సపోర్ట్‌ ఉంటే ఏ రంగంలో అయినా సరే కచ్చితంగా విజయం సాధించవచ్చని రకుల్‌ చెప్పుకొచ్చింది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles