అవును చాలా రిలేషన్స్‌ ఉన్నాయి!

Saturday, December 7, 2024

2022లో ‘శాకిని ఢాకిని’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న హీరోయిన్ రెజీనా కసాండ్రా.. అబ్బాయిలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. ‘అబ్బాయిలు, మ్యాగీ.. 2 నిమిషాలలో అయిపోతాయి’ అంటూ ఫన్నీ కామెంట్‌ చేసి వార్తల్లో నిలిచారు. ఆ సమయంలో రెజీనా పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోయింది. మరోసారి రెజీనా పేరు నెట్టింట ట్రెండ్ అవుతోంది.

ఈసారి తన గురించే పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అర్జున్‌ సాయి డైరెక్షన్‌ లో దిలీప్‌ ప్రకాష్, రెజీనా కసాండ్రా జంటగా నటించిన సినిమా ‘ఉత్సవం’. హార్న్‌బిల్‌ పిక్చర్స్‌పై సురేష్‌ పాటిల్‌ నిర్మించిన ఈ సినిమా.. నేడు తెలుగు, కన్నడ, హిందీలో విడుదల అయ్యింది. ఉత్సవం ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రెజీనా.. తన రిలేషన్‌షిప్స్ గురించి చెప్పుకొచ్చారు. మీకు చాలా ప్రపోసల్స్ వచ్చి ఉంటాయ్ కదా, మీ మనస్సుకు ఒక్కటి కూడా కనెక్ట్ అవ్వలేదా అని అడగ్గా.. ‘కనెక్ట్ అయ్యాయి.

నా జీవితంలో చాలా రిలేషన్‌షిప్స్ ఉన్నాయి. నేను ఓ సీరియల్ డేటర్‌ను అంటూ పెద్ద బాంబు పేల్చింది. ప్రస్తుతం మాత్రం బ్రేక్ తీసుకున్నా’ అని రెజీనా చెప్పారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యింది. తెలుగు యువ హీరోలతో రెజీనా ప్రేమాయణం నడిపినట్లు గతంలో వార్తలు వచ్చాయి.

ఈ జాబితాలో సాయి తేజ్, సందీప్ కిషన్ కూడా ఉన్న సంగతి తెలిసిందే. ‘ఎస్‌ఎంఎస్‌’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రెజీనా.. అనతికాలంలోనే స్టార్ అయ్యారు. ఆ మధ్యన చేసిన హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు ఆమెకు పెద్దగా వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం ఆమె బాలీవుడ్‌పై ఎక్కువగా ఫోకస్ పెట్టారు. డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేని తెరకెక్కిస్తున్న ఓ హిందీ సినిమాలో నటిస్తున్నారు. మరో రెండు హిందీ చిత్రాలు కూడా ఆమె చేతిలో ఉన్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles