వావ్..ఆర్సీ16 సెట్స్ కి వచ్చిన స్పెషల్ గిఫ్ట్! గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం డైరెక్టర్ బుచ్చిబాబు సానా డైరెక్షన్‌లో RC16 మూవీలో యాక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా కోసం ఓ భారీ సెట్ కూడా వేశారు.
ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ ఎలాంటి పాత్రలో నటిస్తారా అని మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా ఆయన తన షూటింగ్ సెట్స్‌కు ఓ స్పెషల్ గెస్ట్‌ను తీసుకొచ్చారు. రామ్ చరణ్ తన కూతురు క్లిన్ కారాను RC16 సెట్స్‌కు తీసుకొచ్చాడు. వీటికి సంబంధించిన ఫోటోను ఆయన తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఇలా తన షూటింగ్ కోసం స్పెషల్ గెస్ట్ రావడం తనకు ఎంతో సంతోషం కలిగించిందని ఆయన రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోను మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో అందాల భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.