తమిళ్ సినిమాల్లో తన సత్తా చాటి, ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి గుర్తింపు సంపాదించిన హీరో ప్రదీప్ రంగనాథన్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. యువతని ఆకట్టుకునే కథలతో ఎప్పుడూ ముందుంటున్న అతను, ఈసారి కూడా అలాంటి యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో సిద్ధమయ్యాడు. ఆ సినిమా పేరు “డ్యూడ్”.
కీర్తీశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా విడుదలైన ట్రైలర్ చూసిన వారందరూ ప్రదీప్ ఈసారి కూడా సరదా, స్టైల్, ఎమోషన్ మిక్స్ చేసి కొత్త హంగుతో వస్తున్నాడని అంటున్నారు. అతని యాక్షన్ స్టైల్, మ్యానరిజంలు ట్రైలర్ లోనే ఆకట్టుకుంటున్నాయి.
సినిమాలో ఎంటర్టైన్మెంట్ కి తోడు యాక్షన్, లవ్ ట్రాక్ ల మేళవింపు బాగుంది. హీరోయిన్ లుగా మమిత బైజు, నేహా శెట్టి ఇద్దరూ వేర్వేరు అంగిలాలలో కనిపిస్తూ మంచి స్పార్క్ చూపించారు. అలాగే కమెడియన్ సత్య, శరత్ కుమార్ వంటి నటులు తెరపైన సరదాగా మెరిసేలా ఉన్నారు.
