జగన్మోహన్ రెడ్డి తనకు ప్రతిపక్ష నేత హోదా కట్టబెట్టకపోతే.. శాసనసభకు రానే రానని మళ్లీ మళ్లీ ప్రకటిస్తూ ఉండడం ద్వారా.. ప్రజల్లో ఎంతగా నవ్వులపాలు అవుతున్నారో ఆయనకు అర్థం కావడం లేదు. అనర్హత వేటు పడే అవకాశం ఉందని తెలిసినా కూడా.. ఏం చేస్తారో చేసుకోండి నేను సభకు రాను.. అంటూ జగన్ మారాం చేస్తున్నారు. నిజానికి ఆయన తన మీద అనర్హత వేటు పడాలని కోరుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. అదే జరిగితే సానుభూతి వస్తుందని ఆశిస్తున్నట్టుగా అనిపిస్తోంది. కానీ ప్రభుత్వం అనర్హత వేటు వేస్తుందో లేదో తెలియదు గానీ.. ప్రతిపక్ష నేత హోదా ఇచ్చే ఉద్దేశంతో మాత్రం లేదు. ఆ విషయాన్ని చంద్రబాబు తాజాగా కూడా స్పష్టం చేశారు. జగన్ ఆశలను ఆయన ఎద్దేవా చేశారు.
‘జగన్ ను ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించారు కాబట్టి.. ఆయన ఎమ్మెల్యేగానే ఉ:టారు. ప్రతిపక్ష నేత హోదా సాధించేందుకు అవసరమైనన్ని సీట్లు ఇవ్వకుండా ప్రజలు ఆయనను తిరస్కరించారు. పదో వంతు సీట్లు ఉంటేనే ఆ హోదా దక్కుతుంది. పార్లమెంటులో అనుసరిస్తున్న విధానమే మేమూ అనుసరిస్తున్నాం. విలువలు పాటించని వాళ్లు విలువల గురించి మాట్లాడడం తప్పే..’ అంటూ చంద్రబాబు ఎద్దేవా చేస్తున్నారు.
ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా తిరస్కకరిస్తే.. కోర్టు వద్దకు వెళ్లి దావాలు నడుపుతున్న జగన్ తీరును ఆయన ఎద్దేవా చేసినట్టుగానే ఈ మాటలు ఉంటున్నాయి. జగన్మోహన్ రెడ్డి విచిత్ర వ్యవహార సరళి పలు రకాలుగా అపహాస్యం పాలవుతోంది. ప్రతిసారీ జగన్.. శాసనసభకు వెళ్లను గానీ.. ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతా అంటుంటారు. కానీ ఆయన అనుచర ఎమ్మెల్యేలందరూ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. కేవలం అనర్హత వేటు పడుతుందనేది మాత్రమే వారి టెన్షన్ కాదు. సభకు వెళ్లకుండా బయట ఉండడం వల్ల.. తమకు ఒరిగేది లేదు. జగన్ వల్ల.. తమ తమ నియోజకవర్గాల ప్రజలు తమను అసహ్యించుకునే పరిస్థితి వస్తోందని అనుకుంటున్నారు.
జగన్ తన సొంత పార్టీ ని కూడా పణంగా పెడుతూ అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారని ప్రజలు కూడా అనుకుంటున్నారు. జగన్ లో మాత్రం మార్పు రాకపోవడం చిత్రమే.
జగన్ డిమాండ్లపై చంద్రబాబు ఎద్దేవా!
Monday, April 21, 2025
