చంద్రబాబుపై  మోడీకి ఎంs నమ్మకం కుదిరిందంటే..

Thursday, March 20, 2025

దేశ రాజధాని ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. 27 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత హస్తినాపురాన్ని కమలదళం చేజిక్కించుకుంది. అప్పట్లో భారతీయ జనతా పార్టీ ప్రభావానికి గండి కొట్టిన కాంగ్రెస్, ఇప్పటి ఎన్నికలలో అసలు నామరూపాలు లేకుండా పోయింది! మూడు దఫాలు వరుస విజయాలతో అధికార పీఠాన్ని అధిష్టించిన ఆమ్ ఆద్మీ పార్టీ- కనీసం మూడోవంతు సీట్లను కూడా సొంతం చేసుకోలేక చతికిల పడింది. ఇలాంటి విజయం భారతీయ జనతా పార్టీకి అపూర్వం అని చెప్పాలి! ఈ విజయాన్ని వారు ఘనంగానే సెలబ్రేట్ చేసుకున్నారు. విజయోత్సవ వేడుకలలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఢిల్లీని అనూహ్యమైన రీతిలో అభివృద్ధి చేస్తామని, అవినీతి రహిత పరిపాలన అందిస్తామని మాట ఇచ్చారు. అయితే కమలదళం విజయోత్సవ వేడుకలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కూడా విపరీతంగా ప్రశంసలు దక్కడం, మోడీ ఆయనను కీర్తించడం కొత్త పరిణామం!

అభినందన సభలో ఢిల్లీ వచ్చి ప్రచారం చేసినందుకు చంద్రబాబు నాయుడుకు కూడా థాంక్స్ చెబుతూ ప్రధాని మోడీ ఒకటి రెండు వాక్యాలు మాట్లాడితే సరిపోయి ఉండేది. ఆయన అక్కడితో ఆగలేదు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇతర సీనియర్ నేతలందరూ హాజరైన వేడుకలలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి పలు అంశాలు నరేంద్ర మోడీ ప్రస్తావించారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు రావడానికి హర్షం వ్యక్తం చేశారు. కూటమిలో భాగమైన తెలుగుదేశం అధినేత ఢిల్లీలోని తెలుగువారు అధికంగా ఉండే నియోజకవర్గాలలో అక్కడి తెలుగుదేశం పార్టీ శ్రేణులతో బీజేపీకి అనుకూలంగా ప్రచారం చేయించడానికి చంద్రబాబు టీడీపీ ఎంపీలు ఎంతో సహకరించారని అన్నారు. ఈ అపూర్వ విజయానికి వారి కృషి కూడా తోడ్పడుతుందని పేర్కొన్నారు. అభివృద్ధి, సుపరిపాలనలో చంద్రబాబు తన ట్రాక్ రికార్డును స్థాపించారని ప్రధాని కొనియాడారు. ఎక్కడైతే నాయకులు అభివృద్ధి మార్గాన్ని ఎంచుకుంటారో అక్కడ మంచి ఫలితాలు వస్తాయని, ఆంధ్ర ప్రదేశ్ ఉదాహరణగా నరేంద్ర మోడీ ఈ వేదికపై ప్రకటించడం విశేషం.

ఢిల్లీ ఎన్నికల కృతజ్ఞతల సభలో ఇంతగా చంద్రబాబు నాయుడు ను పొగడ వలసిన అవసరం నరేంద్ర మోడీకి లేదు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్ డి ఏ కూటమిలో రెండో అతిపెద్ద పార్టీగా ఎదిగినటువంటి తెలుగుదేశం అధినేత పై అపరిమితమైనది విశ్వాసానికి నమ్మకానికి ఉదాహరణగా ఈ మాటలను పరిగణించా.లి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ లో రెండో అతిపెద్ద పార్టీ నేత అయినప్పటికీ ఏనాటికి ఎన్డీఏను బెదిరించే ధోరణిలో కాకుండా సామరస్యంగా తమ రాష్ట్రానికి కావలసిన పనులను చక్రబెట్టుకునే ప్రయత్నంలోనే గడుపుతున్నారు. చంద్రబాబు రాజనీతికి ఢిల్లీ పెద్దలతో వ్యవహరిస్తున్న తీరు ఒక పెద్ద ఉదాహరణ. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా పాల్గొన్నారు. రాష్ట్రం కోసం తప్ప మరో అంశం కోసం ఢిల్లీ పెద్దలను ఆశ్రయించినది లేదు. ఇలాంటి లక్షణాలన్నీ కలిపి చంద్రబాబుపై నరేంద్ర మోడీ గౌరవాన్ని ఇనుముడింపజేశాయని చెప్పాలి. అందుకే ఈ స్థాయిలో ప్రధాని కీర్తించారని ప్రజలు అనుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles