మీరెవరు అసలు! బుల్లితెర నుంచి వెండితెర మీదికి ఎంట్రీ ఇచ్చి మంచి ఆదరణ పొందింది అనసూయ భరధ్వాజ్. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయిపొయింది ఈ అమ్మడు. చాలా ఆఫర్లు వచ్చినా ఆచితూచి పాత్రల్ని ఎంచుకుంటోంది. ఇక ఎప్పటికప్పుడు వివాదాస్పద కామెంట్స్ కూడా చేస్తోంది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ క్రేజీ కామెంట్స్ చేసింది. అనసూయ మాట్లాడుతూ.. ‘నా బట్టలు నా ఇష్టం. బికినీ వేసుకుంటా.. లేదంటే విప్పుకొని తిరుగుతా.. అది నా ఇష్టం.. అడగడానికి మీరెవరు’ అంటూ నెటిజన్ల పై ఓ రేంజ్ లో సీరియస్ అయింది.
అయితే అనసూయ కామెంట్స్ పై మాత్రం నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఆ కామెంట్లకి కూడా సాలిడ్ కౌంటర్ ఇస్తూ.. ‘కెరీర్ పరంగా మూవీస్ పరంగా మీ సలహాలను నేను స్వీకరిస్తాను, ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాను. కానీ, నా వ్యక్తిగత విషయాలు మీకెందుకు ?’ అంటూ అనసూయ చెప్పుకొచ్చింది.