డాకు మహారాజ్ ఫస్ట్‌ సింగిల్‌ ఎప్పుడంటే!

Saturday, December 7, 2024

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా మరో హీరోయిన్ శ్రద్దా శ్రీనాథ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న భారీ సినిమా  “డాకు మహారాజ్”. దర్శకుడు బాబీ కొల్లి తీర్చిదిద్దుతున్న ఈ సినిమా పట్ల భారీ హైప్ అయితే నెలకొంది. ఇపుడు ఈ సినిమా చివరి దశలో ఉంది.

అయితే ఈ సినిమా నుంచి ఇపుడు వరకు చాలా తక్కువ మొత్తంలోనే అప్డేట్స్ వచ్చినప్పటికీ వచ్చిన కొన్ని కూడా అదరగొట్టాయని చెప్పుకొవచ్చు. మరి ఈ సినిమాతో పాటుగా ఉన్న సంక్రాంతి సినిమాలు ఆల్రెడీ ఫస్ట్ సింగిల్స్ పై ఓ క్లారిటీ అయితే విడుదల చేశాయి. కానీ ఈ సినిమా నుంచి ఇంకా ఫస్ట్ సింగిల్ పై మాత్రం ఇంకా ఏ అప్డేట్‌ బయటకు రాలేదు.

అయితే ఈ ఫస్ట్ సింగిల్ ని మేకర్స్ డిసెంబర్ మొదటి వారంలో విడుదల చేసే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. ఆల్రెడీ బాలయ్య కోసం థమన్ మళ్ళీ సాలిడ్ వర్క్ అందించినట్టుగా సమాచారం. మరి ఈ సాంగ్ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.  

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles