యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ హీరోగా మణిరత్నం తెరకెక్కిస్తున్న భారీ ప్రాజెక్ట్ ‘థగ్ లైఫ్’ మీద క్రేజ్ రోజు రోజుకి పెరిగిపోతోంది. త్రిష, శింబులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచింది. ట్రైలర్ విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.
ఇక చిత్రానికి సంబంధించి విడుదలైన మొదటి పాట అలరించింది. తాజాగా మ్యూజిక్ టీమ్ రెండో సాంగ్ విడుదల తేదీని ఖరారు చేసింది. మే 21న విడుదల కానున్న ఈ పాట ‘షుగర్ బేబీ’ అని పేరుతో త్రిష మీద చిత్రీకరించడం జరిగింది. ఇందులో త్రిషను చాలా రొమాంటిక్ గా చూపించారు. ఈ పోస్టర్ ఇప్పటికే సోషల్ మీడియాలో దూసుకుపోతోంది.
ఈ పాటకి మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ స్వరాలు అందించగా, ఆయన సంగీతం మరోసారి మ్యాజిక్ చేస్తుందనే నమ్మకం ఉంది. ఇక పూర్తిగా ప్రేమకథ నేపథ్యంతో సాగే ఈ పాట యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉందని సమాచారం.
ఇదిలా ఉండగా, ‘థగ్ లైఫ్’ మూవీని జూన్ 5న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ప్రమోషన్స్ కూడా సాలిడ్ గా ప్లాన్ చేసారు. కమల్ హాసన్ – మణిరత్నం కాంబినేషన్ పై ఉండే హైప్ కి తగినట్టే సినిమా అంచనాలు ఉన్నాయి.