“పుష్ప 2” ఆ రూమర్స్ పై క్లారిటీ ఏంటంటే..!

Tuesday, November 5, 2024

టాలీవుడ్ లో మోస్ట్‌ అవైటెడ్‌ సినిమా ఏదైనా ఉంది అంటే అది కచ్చితంగా పాన్‌ ఇండియా మూవీల్లో ఒకటైన పుష్ప 2 నే. ఈ సినిమాలో
 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  హీరోగా,  రష్మికా  హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తీర్చి దిద్దుతున్న భారీ సినిమాగా దీని గురించి చెప్పుకొవచ్చు.
 ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా కోసం అభిమానులు ఎప్పటి  నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  కానీ విడుదల మాత్రం ఈ ఆగస్ట్ లోనే కావాల్సింది. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల డిసెంబర్ కి వాయిదా పడిన సంగతి తెలిసిందే.

అయితే ఈ చిత్రం ఈ డేట్ లో కూడా రాదనీ మూవీ మేకర్స్ తాజాగా అంటున్నారు. ఈ సినిమాని విడుదల చేసేందుకు మరో కొత్త డేట్‌ ని త్వరలోనే ప్రకటించనున్నారని సమాచారం.  ఈ విషయం గురించి సోషల్‌ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.  అయితే ఇపుడు ఈ సినిమా విడుదల గురించి వస్తున్న రూమర్స్ పై క్లారిటీ తెలుస్తుంది.

ప్రస్తుతానికి మేకర్స్ డిసెంబర్ 6 డేట్ లోనే స్టిక్ అయ్యి ఉన్నట్లు సమాచారం. మళ్ళీ కొత్త డేట్ వదిలే ప్లానింగ్స్ లాంటివి లేవని ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేయడం పైనే దృష్టి ఉంచినట్టుగా సమాచారం. సో పుష్ప 2 నుంచి కొత్త డేట్ వస్తుంది అనే ఊహాగానాల్లో నిజం లేదని తెలిసిపోయింది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles