అక్కినేని నాగచైతన్య నటిస్తున్న ది మోస్ట్ అవైటెడ్ సినిమా ‘తండేల్’ మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహిస్తుండగా పూర్తి రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్దంగా ఉంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ఈ సినిమాపై సాలిడ్ బజ్‌ని క్రియేట్ చేశాయి.ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ హిట్ రికార్డు క్రియేట్ చేయడం గ్యారంటీ అని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే, ఈ సినిమాలో నాగచైతన్య పవర్‌ఫుల్ పాత్రలో నటించాడని.. తండేల్ రాజు పాత్ర ప్రేక్షకులకు చాలా ఏళ్లు గుర్తుండిపోవడం ఖాయమని మేకర్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
కాగా, ఈ సినిమాలో నటించినందుకు నాగచైతన్య ఎంతమేర రెమ్యునరేషన్ తీసుకున్నాడనే విషయంపై సోషల్ మీడియాలో ప్రస్తుతం చర్చ సాగుతోంది. ఈ సినిమా కోసం నాగచైతన్య చాలా సమయం కేటాయించాడని.. దీనికి అనుగుణంగానే ఆయన రెగ్యులర్‌గా తీసుకునే రెమ్యునరేషన్ కంటే డబుల్ తీసుకుని ఉంటారని సినీ సర్కిల్స్‌లో వార్తలు షికారు చేస్తున్నాయి. కానీ, ఇందులో నిజం లేదని తెలుస్తోంది. ఆయన తన రెగ్యులర్ రెమ్యునరేషన్ రూ.10 కోట్లు తండేల్ మూవీకి కూడా తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ చిత్రానికి మేకర్స్ తన మార్కెట్ కంటే ఎక్కువ ఖర్చుపెట్టారని.. అందుకే తన రెమ్యునరేషన్ విషయంలో ఎలాంటి పెంపు లేకుండా చైతూ రెగ్యులర్ పేమెంట్ తీసుకున్నాడని సమాచారం.