కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా మంజు వారియర్ కథానాయికగా, అలాగే టాలీవుడ్ వెర్సటైల్ నటుడు రానా దగ్గుబాటి విలన్ రోల్ లో దర్శకుడు టి జె జ్ఞానవేల్ తెరకెక్కించిన మూవీ “వేట్టయన్”. గతేడాది దసరా కానుకగా వచ్చిన ఈ సినిమా యావరేజ్ గా ఆడింది.తెలుగులో కూడా పర్వాలేదు అనే రేంజ్ లోనే ఆడిన ఈ సినిమా ఇపుడు ఫైనల్ గా తెలుగు టెలివిజన్ వరల్డ్ ప్రీమియర్ గా టెలికాస్ట్ అయ్యేందుకు రెడీ అయ్యింది.
మరి ఈ సినిమాని జెమినీ టీవీ వారు సొంతం చేసుకోగా ఈ ఫిబ్రవరి 16న సాయంత్రం 6 గంటలకి టెలికాస్ట్ కి సిద్ధం అయ్యింది. మరి ఇటీవల తమిళ నాట టెలికాస్ట్ అయ్యి ఈ మూవీ భారీ రెస్పాన్స్ ని అందుకుంది. మరి మన తెలుగులో ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుంది అనేది చూడాల్సిందే.