మళ్లీ మనం కలుసుకునే వరకు నాన్న..!

Sunday, December 8, 2024

టాలీవుడ్‌ తో పాటు అన్ని భాషల్లోనూ హీరోయిన్‌ గా స్టార్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది అందాల భామ సమంత. తాజాగా ఆమె సిటాడెల్‌ అనే వెబ్‌ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిన్నటి వరకు సిటాడెల్‌ ప్రమోషన్స్‌ తో బిజీగా ఉన్న సమంత వెబ్‌ సిరీస్‌ సక్సెస్‌ తో ఫుల్ జోష్‌ మీద ఉంది.

ఈ క్రమంలో సమంత ఒక్కసారిగా కుంగిపోయే సంఘటన జరిగింది. ఆమె తండ్రి జోసెఫ్‌ ప్రభు గుండెపోటుతో చనిపోయారు.  తండ్రి మరణానికి  సంబంధించిన విషయాన్ని సమంత స్వయంగా సోషల్‌ మీడియా ద్వారా హార్ట్‌ బ్రేక్‌ ఎమోజీని షేర్‌ చేయడం ద్వారా తెలిపారు. జోసెఫ్‌ ప్రభు మృతి పై ఇండస్ట్రీ వర్గాల వారు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. తండ్రి మరణంపై స్పందిస్తూ హార్ట్‌ బ్రేక్‌ ఎఈమోజీని షేర్‌ చేసిన సమంత.. ‘నాన్నా మనం మళ్లీ కలిసేంత వరకు’ అంటూ తన గుండె పగిలింది అన్నట్లుగా పేర్కొంది.

సమంత తండ్రి మృతి పట్ల ఆమె ఫ్యాన్స్‌తో పాటు ఇండస్ట్రీ వర్గాల వారు నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే విడాకులు, అనారోగ్య పరిస్థితుల కారణంగా ఎదుర్కొన్న ఒడిదొడుకుల నుంచి బయట పడుతున్న సమంత మళ్లీ ఇంత పెద్ద విషాదంలో చిక్కుకోవడం బాధాకరం అంటూ ఆమె ఫ్యాన్స్‌ విచారం వ్యక్తం చేస్తున్నారు

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles