సౌత్‌ ఇండస్ట్రీ పై టాలీవుడ్‌ చందమామ కీలక వ్యాఖ్యలు!

Saturday, December 7, 2024

టాలీవుడ్‌ చందమామ తాజాగా నటించిన చిత్రం సత్యభామ. ఈ సినిమాలో నవీన్‌ చంద్ర, ప్రకాష్‌ రాజ్‌, నాగినీడు, హర్షవర్థన్‌, రవి వర్మ, అమరేందర్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్‌ 7 న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది.  ఈ నేపథ్యంలోనే ఓ ఇంటర్వ్యూలో సౌత్‌ ఇండస్ట్రీ పై కాజల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందీలో మాదిరి దక్షిణాదిలో పెళ్లయిన హీరోయిన్స్‌కు అవకాశాలు ఇవ్వరని కాజల్‌ అంది.

బాలీవుడ్, దక్షిణాది ఇండస్ట్రీకి మధ్య చాలా తేడా ఉందన్నారు. ‘హిందీ, దక్షిణాది ఇండస్ట్రీ మధ్య చాలా తేడా ఉంటుంది. దక్షిణాదిలో పెళ్లయిన హీరోయిన్స్‌కు అవకాశాలు తక్కువ. బాగా లేరని పక్కన పెట్టేస్తారు. అదే హిందీలో పెళ్లయినా అవకాశాలు వస్తుంటాయి. షర్మిళా ఠాకుర్, హేమమాలిని మొదలుకొని.. ఐశ్వర్య రాయ్, దీపికా పదుకొణె, ఆలియా భట్, కియారా అద్వానీ లాంటి వాళ్లకు హీరోయిన్లుగా అవకాశాలు వస్తున్నాయి.

కానీ దక్షిణాదిలో అలాంటి పరిస్థితి లేదు. నయనతార ఇందుకు అతీతం. దక్షిణాదిలో ఉన్న ఈ పరిస్థితిని త్వరలో మారుద్దాం’ అని కాజల్‌ పేర్కొన్నారు.ఇలియానా, తాప్సీ, పూజా హెగ్డే.. ఇలా చాలామంది హీరోయిన్స్‌ బాలీవుడ్ వెళ్లక దక్షిణాది ఇండస్ట్రీపై కామెంట్స్ చేశారు. తాజాగా ఆ జాబితాలో కాజల్ చేరారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles