ఆ రుమార్స్ లో నిజం లేదు! గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా సినిమా గేమ్ ఛేంజర్ తర్వాత చేస్తున్న తన కెరీర్ 16వ సినిమా గురించి అందరికీ తెలిసిందే. మరి డైరెక్టర్ బుచ్చి బాబు సానా కాంబోలో చేస్తున్న ఈ సినిమా పట్ల భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఇక ఈ సినిమా షూటింగ్ ఇపుడు శరవేగంగా కంప్లీట్ అవుతుండగా తాజాగా ఓ రూమర్ ఈ సినిమాలో చరణ్ పాత్రపై షికారు చేస్తుంది. దీంతో రామ్ చరణ్ ఈ సినిమాలో ఒక అంధునిగా కనిపిస్తాడు అని టాక్ వైరల్ గా మారింది. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. ఈ సినిమాలో చరణ్ కి మరో వైకల్యం ఉంటుంది కానీ కళ్ళు కనిపించని పాత్రలో మాత్రం తాను చేయడం లేదట. సో ఆ రూమర్స్ లో నిజం లేదని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి ఏ ఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నారు.