లెక్కల మాస్టర్‌ తో సినిమా చేయబోతున్న రౌడీ హీరో!

Saturday, December 7, 2024

టాలీవుడ్‌ యంగ్‌ రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ గురించి అందరికీ తెలిసిందే. కొంతకాలం క్రితం ఫ్యామిలీ స్టార్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఆ సినిమా అనుకున్న విజయాన్ని అందుకోలేకపోయింది. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రౌడీ హీరో లైనప్ మహా గొప్పగా ఉంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ మీద గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో మూవీ, దిల్ రాజు నిర్మాతగా రవికిరణ్ కోలాతో చేయబోయే చిత్రం, రాహుల్ సంకృత్యాన్ తో లాక్ చేసుకున్న పీరియాడిక్ డ్రామా గా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు.

ఇప్పుడు తాజాగామరో మూవీని లైన్లో పెట్టినట్లు తెలుస్తుంది. మూడేళ్ళ క్రితమే విజయ్ దేవరకొండ దర్శకుడు సుకుమార్ కలయికలో ఒక సినిమాను అఫీషియల్ గా ప్రకటించిన విషయం తెలిసిందే.  దానిపై ఎటువంటి అప్డేట్ ఇప్పటి వరకు రాలేదు. ఇన్నాళ్లకు మళ్ళీ ఆ కాంబో గురించి కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం సుక్కు పుష్ప 2 చేస్తూ బిజీగా ఉన్నాడు.  ఆ సినిమా అవ్వగానే రామ్ చరణ్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు మరో ఏడాది వరకు ఉంటాయాని తెలుస్తుంది.

అయితే ఆనంద్ దేవరకొండ నటించిన గంగం గణేశా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ లో నిర్మాత వంశీ కారుమంచి మాట్లాడుతూ కొంత ఆలస్యమైనా విజయ్ దేవరకొండ సుకుమార్ కాంబోలో సినిమా చేస్తామని వివరించారు. దాంతో విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషిలో ఉన్నారు. ఇక సుకుమార్ తిరిగి రామ్ చరణ్ కోసం ఎంతలేదన్నా రెండు మూడు సంవత్సరాలు కేటాయించాల్సి ఉంటుంది. అప్పటికి విజయ్ దేవరకొండ మార్కెట్ ఎలా ఉంటుందో తెలియదు.. ఇప్పుడు ఫ్యాన్స్ సంబరపడిన కూడా అప్పటికి ఈ కాంబో సినిమా ఉంటుందో లేదో చూడాల్సిందే మరి!

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles