బన్నీకి గిఫ్ట్‌ ఇచ్చిన రౌడీ హీరో!

Saturday, December 7, 2024

ఐకాన్‌ స్టార్ హీరో  అల్లు అర్జున్ పుష్ప-2 మేనియాతో ప్రస్తుతం ఇండియన్ సినిమా లవర్స్ ఓ రేంజ్‌ లో ఊగిపోతున్నారు. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులు షేక్ అవ్వడం ఖాయమని అభిమానులు ఎంతో ధీమాగా ఉన్నారు. ఈ సినిమా కోసం ప్రేక్షకులతో పాటు సెలెబ్రిటీలు కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారు.

అల్లు అర్జున్‌ని ఇష్టపడేవారిలో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ కూడా ఉన్నాడు. తాజాగా ఆయన పుష్పరాజ్‌కి ఓ సర్‌ప్రైజ్ గిఫ్ట్ పంపాడు. రౌడీ బ్రాండ్‌తో తయారైన షర్ట్‌పై ‘పుష్ప’ అనే పేరును ఆయన ప్రింట్ చేయించాడు. ఈ షర్ట్‌ని బన్నీకి గిఫ్ట్‌గా ఇచ్చాడు విజయ్. దీంతో తనకు వచ్చిన గిఫ్ట్‌కు అల్లు అర్జున్ విజయ్‌కి థ్యాంక్స్ చెబుతూ సోషల్ మీడియాలో ఓ థాంక్యూ పోస్ట్‌ పెట్టాడు.

ఇలాంటి ప్రేమను చూపినందుకు థ్యాంక్స్ అంటూ బన్నీ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ సినిమా డిసెంబర్ 5న గ్రాండ్ విడుదలకు సిద్దం అవుతుండడంతో ప్రమోషన్స్‌ను నెక్స్ట్ లెవెల్‌లో చేస్తున్నారు.  

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles