బృహత్ అమరావతికి సాకారానికి తొలి అడుగు!

Friday, July 11, 2025

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని అయిదేళ్ల పాటు పరిపాలించడం వల్ల, అభివృద్ధిని తుంగలో తొక్కి ఈ రాష్ట్రానికి విధ్వంసం అంటే ఏమిటో రుచిచూపించడం వల్ల.. చంద్రబాబు విజన్ లోని స్వప్నాలన్నీ వెనక్కుపోయాయి. అయిదేళ్ల తర్వాత జగన్ ను భరించలేకపోయిన ప్రజలు తిరిగి చంద్రబాబుకే రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లే బాధ్యతను కట్టబెట్టారు. ఈ అవకాశాన్ని మరింత సమర్థంగా వాడుకోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. గతంలో స్వప్నించిన దానికంటె గొప్పగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకున్నారు. బృహత్ అమరావతి.. కూడా అందులో భాగమే. 2014-19 మధ్య కాలంలో ప్లాన్ చేసిన అమరావతి రాజధాని నగరానికి అదనంగా.. మరో 40 వేల ఎకరాలకు పైగా సేకరించి.. రాజధాని నగర విశ్వరూపాన్ని ఆవిష్కరింపజేయాలనే చంద్రబాబునాయుడు స్వప్నాన్ని సాకారం చేసుకునే దిశగా తొలి అడుగు పడింది.

ఏపీ రాజధాని అమరావతిలో ల్యాండ్ పూలింగ్ స్కీమ్ 2025 కు సంబంధించిన విధివిధానాలను  ప్రభుత్వం జారీ చేసింది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల అయింది. భూములు పూలింగ్ కింద ఇచ్చే రైతులకు ఎలాంటి ప్రయోజనాలు వర్తిస్తాయో అందులో వివరించారు.

రాజధాని నిర్మాణం కోసం గతంలో 55 వేల ఎకరాలను ప్రభుత్వం పూలింగ్ ద్వారా సేకరించిన సంగతి తెలిసిందే. ఆ రాజధాని ప్రాంతం మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి తన పాలన కాలంలో స్మశానంలాగా మార్చేయడానికి బరితెగించారు. ఒక్క పని కూడా చేయకుండా.. కోర్టు ఉత్తర్వులను కూడా బేఖాతరు చేసి ఆయన విధ్వంసరచన చేశారు. మూడురాజధానుల డ్రామా మాటలు మాట్లాడుతూ.. ప్రెవేటు వ్యక్తులు, ఇతర కేంద్రప్రభుత్వ రంగ సంస్థలు కూడా రాజధానిలో పనులు చేయడానికి సుముఖత చూపించని పరిస్థితి కల్పించారు. ఇప్పుడు చంద్రబాబు మళ్లీ సీఎం అయిన తర్వాత.. ఆగిపోయిన పనులన్నీ తిరిగి ప్రారంభం అయ్యాయి. కొన్ని నెలల్లోనే అధికారుల క్వార్టర్లు అందుబాటులోకి రానున్నాయి. అలాగే ఎమ్మెల్యే క్వార్టర్లు కూడా త్వరగానే పూర్తవుతాయని అంటున్నారు. రాజధాని ప్రాంతంలో భూములిచ్చిన రైతులందరికీ కూడా.. వారి వారికి సొంతమయ్యే ప్లాట్ల కేటాయింపు కూడా పూర్తయిపోయింది. రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించిన పనులు వేల కోట్ల వ్యయంతో శరవేగంగా జరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రెవేటు నిర్మాణాలు కూడా త్వరలోనే ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
వాటికి అదనంగా చంద్రబాబు నాయుడు అంతర్జాతీయ స్థాయి రాజధాని, స్పోర్ట్స్ కాంప్లెక్స్, స్మార్ట్ పరిశ్రమలకు అనువైన వేదికలను సిద్ధం చేయాలని అనుకున్నారు. ఆయన ఆలోచనకు ఆ ప్రాంత రైతులు కూడా మద్దతు ఇవ్వడంతో మరో నలభై వేల ఎకరాల సమీకరణకు ఇప్పుడు ప్రయత్నాలు మొదలయ్యాయి. నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పటికే గ్రామాల్లో నిర్వహించిన సదస్సుల్లో రైతులు అంగీకారం వ్యక్తం చేసి ఉన్న నేపథ్యంలో ఈ దఫా భూసమీకరణ మరింత త్వరగా పూర్తవుతుందని.. ఈ అయిదేళ్లలోనే కొత్త స్వప్నాలకు సంబంధించిన పనులు కూడా ప్రారంభం అవుతాయని అంటున్నారు. 

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles