గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘ఉప్పెన’ ఫేం డైరెక్టర్ బుచ్చిబాబు సానా డైరెక్షన్‌లో RC16 సినిమాలో యాక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను డైరెక్టర్ అత్యంత ప్రెస్టీజియస్‌గా ఓ సాలిడ్ కథతో తీర్చిదిద్దుతున్నాడు.
ఈ సినిమాలో రామ్ చరణ్ పాత్ర అల్టిమేట్‌గా ఉండనుందని చిత్ర యూనిట్ అంటుంది. అయితే, ఈ సినిమాకు సంబంధించి ఓ అంశంలో తన గురువైన స్టార్ డైరెక్టర్ సుకుమార్ బాటలోనే బుచ్చిబాబు కూడా వెళ్లనున్నట్లు సమాచారం.సుకుమార్ డైరెక్షన్‌లో రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.
ఆ సినిమా కథ మొత్తం ఒక ఎత్తు అయితే, క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్. ఆ సినిమాకు ఆయువుపట్టుగా నిలిచింది క్లైమాక్స్ అని చాలా మంది అభిప్రాయపడ్డారు. అందుకే ఆ సినిమాకు రిపీటెడ్ ఆడియన్స్ వచ్చారు. ఇప్పుడు RC16 కోసం బుచ్చిబాబు కూడా ఇదే స్ట్రాటెజీ ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది.
ఈ సినిమా కథ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు. అయితే, దీనికి క్లైమాక్స్‌ని మాత్రం ఎవరూ ఊహించని విధంగా రాసుకున్నాడట ఈ డైరెక్టర్. ఈ సినిమా క్లైమాక్స్ చాలా ఏళ్లు గుర్తుండిపోతుందని చిత్ర యూనిట్ చెబుతోంది. మరి నిజంగానే బుచ్చిబాబు RC16 కోసం సెన్సేషనల్ క్లైమాక్స్‌ని సిద్దం చేశాడా..? లేదా అనేది వేచి చూడాల్సిందే మరి.