నాని నటించిన తాజా సినిమా “హిట్ 3” తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ మంచి విజయాన్ని అందుకుంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా, శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నాని కెరీర్ లోనే భారీ వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. పాన్ ఇండియా సినిమాగా అన్ని భాషల్లో విడుదల చేసినా, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇది సాలిడ్ కలెక్షన్లతో దూసుకెళ్లింది.
అయితే హిందీలో ఈ సినిమా పరిస్థితి ఎలా ఉందో అనేది ఇప్పుడు తెలిసి వచ్చింది. బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం, హిందీ వెర్షన్ నార్త్ బెల్ట్ లో రిలీజ్ అయి ఆరురోజుల్లో దాదాపు ఐదు కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు రాబట్టిందట. ఈ ఫిగర్స్ చూసినప్పుడు, హిందీలో కూడా సినిమాకు ఓ మోస్తరు స్పందన వచ్చినట్టే కనిపిస్తోంది.
వీక్ డేస్ లోకి వచ్చిన తరువాత కూడా హిట్ 3కి ఆడియెన్స్ నుంచి రీస్పాన్స్ తగ్గకపోవడం, మంచి బుకింగ్స్ ఉండటం పాజిటివ్ సిగ్నల్ గా భావించవచ్చు. మొత్తంగా చెప్పాలంటే, హిట్ 3 హిందీలో అద్భుతంగా కాకపోయినా, బాగానే నిలబడి హల్‌చల్ చేస్తుంది. సినిమా చివరికి ఎలాంటి మొత్తం వసూళ్లతో ఆగుతుందో చూడాలి.