అందుకే నాకు తెలుగంటే.. అంత ప్రత్యేకం!

Sunday, December 8, 2024

తెలుగు చిత్ర పరిశ్రమలో పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలా తక్కువ టైంలోనే స్టార్‌ స్టేటస్ అందుకుంది. టాలీవుడ్‌ లో అగ్ర హీరోలైన ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేష్ బాబు.. ఇలా స్టార్ హీరోలందరితో నటించి భారీ క్రేజ్ సొంతం చేసుకుంది. అయితే చాలా కాలంగా తెలుగులో పెద్దగా ఆఫర్స్ లేని ఈ ముద్దుగుమ్మ తనకు తెలుగు సినిమా ఎంతో ప్రత్యేకం అని చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం ఇతర భాషల్లో అవకాశాలు అందుకుంటున్న పూజా హెగ్డే.. తాజాగా అభిమానులతో జరిపిన చిట్‌చాట్‌లో తెలుగు సినిమాపై తనకున్న ప్రేమని ఈ ముద్దుగుమ్మ వివరించింది. తాజాగా అభిమానులతో పూజ హెగ్డే చిట్ చాట్ చేసింది. ఇందులో ఓ అభిమాని అన్ని భాషల్లో నటిస్తున్నారు కదా.. నటిగా మీ ముందు ప్రయారిటీ ఏ భాషకిస్తారు? అనడిగితే.. ‘నటనకు ప్రాంతీయబేధం లేదు. ఏ భాషలోనైనా నాకు కంఫర్ట్‌గానే ఉంటుంది.

అయితే.. తెలుగు సినిమా నాకు ప్రత్యేకం. ఎందుకంటే.. నాకంటూ ఓ ఐడెంటిటీని ఇచ్చింది మాత్రం తెలుగు సినిమానే. అందుకే తెలుగు సినిమా నాకు చాలా స్పెషల్ అంటూ చెప్పుకొచ్చింది. నేను ఎన్ని భాషల్లో నటించినా.. తెలుగులో అవకాశం వస్తే మాత్రం కొంచెం ఎక్కువ గానే ఆనందిస్తా. త్వరలో తెలుగులో ఓ మంచి సినిమా తో మీ ముందుకు వస్తా’ అంటూ  చెప్పుకొచ్చింది. ఇక రీసెంట్ గా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సరసన ఛాన్స్‌ని కొట్టేసిన పూజా.. ఇటీవలే ఓ హిందీ సినిమాకు కూడా యస్‌ చెప్పినట్లు తెలుస్తుంది.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles