అదిరింది బాస్‌…మాటల్లేవంతే!

Wednesday, September 18, 2024

జాతీయ నటుడు అల్లు అర్జున్‌, స్టార్‌ డైరెక్టర్‌ సుకుమార్ కాంబోలో వచ్చిన సినిమా పుష్ప. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో అల్లు అర్జున్‌ జాతీయ నటుడు అవార్డును కూడా అందుకున్నాడు. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని పుష్ప సినిమా టైమ్‌ లోనే చిత్ర బృందం వెల్లడించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో వస్తున్న సినిమానే పుష్ప 2 ది రూల్‌… పుష్ప సినిమా భారీ విజయాన్ని సాధించడంతో ఈ సినిమా పై అంచనాలు భారీ నెలకొన్నాయి.ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఆగస్టు 15న ఈ మూవీని రిలీజ్ చేస్తామంటూ మేకర్స్ ప్రకటించిన నాటి నుంచి షూటింగ్ను శరవేగంగా జరుపుతున్నారు… కాగా, ఈరోజు అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్బంగా ఈ చిత్రం నుంచి టీజర్ ను విడుదల చేశారు..

సోమవారం ఐకాన్‌ స్టార్‌ పుట్టిన రోజు సందర్భంగా  అభిమానుల కోసం టీజర్‌ ను విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ముందుగానే ప్రకటించింది. దీంతో టీజర్ ఎప్పుడెప్పుడూ విడుదల అవుతుందా అంటూ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. అనుకున్నట్లుగానే టీజర్ ఈరోజు ఉదయం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.

ఈ టీజర్‌ లో యాక్షన్ సీన్స్, తిరుపతి గంగమ్మ జాతర నేపథ్యం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.. కేవలం తెలుగు ఆడియన్స్ మాత్రమే కాదు పాన్ ఇండియా స్థాయిలో ఆడియన్స్ అందరిని ఆకట్టుకునేలా టీజర్ కట్ చేశారు.. సుక్కు మరోసారి ఊరమాస్ గా అల్లు అర్జున్ చూపించబోతున్నారని టీజర్ ను చూస్తే అర్థమవుతుంది.. చాలు, ఈ మాత్రం చాలు.. చొక్కాలు చించుకోవడానికి రెడీ అవండి అంటూ ఫ్యాన్స్ వీడియోను టేగ్ ట్రెండ్ చేస్తున్నారు.. ఈ టీజర్ విడుదలైన కొన్ని నిముషాలకె భారీగా వ్యూస్ ను సొంతం చేసుకుంది.ఇక ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమా పై అంచనాలను పెంచేస్తున్నాయి.. బన్నీ ఫస్ట్ లుక్ పోస్టర్.. రష్మిక లుక్.. ఫహాద్ లుక్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి.

పుష్ప సినిమా పూర్తి అయిన కొద్ది కాలానికే పుష్ప 2 సినిమా షూటింగ్ జరుపుకోవడం మొదలు పెట్టింది కానీ..ఇప్పటి వరకు సినిమా నుంచి కేవలం లుక్స్ పోస్టర్స్ మాత్రమే విడుదల అవుతుండడంతో అభిమానులు నిరాశలో ఉన్నారు. దీంతో తాజాగా విడుదల చేసిన టీజర్‌ చూసిన అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles