టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొత్త సినిమాకు రంగం సిద్ధం చేస్తున్నాడు. తమిళ నటుడు విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించనున్న ఈ సినిమాను ఇటీవలే అధికారికంగా ప్రకటించాడు పూరి. ప్రీ-ప్రొడక్షన్ పనులతో యూనిట్ ఇప్పటికే బిజీగా మారింది.
ఇప్పుడు క్యాస్టింగ్ పనులను పూరి పూర్తి వేగంగా నిర్వహిస్తున్నాడు. టబు, దునియా విజయ్ లాంటి ప్రముఖులు ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడం ఖరారైంది. ఇదిలా ఉండగా బాలీవుడ్ నటి విద్యా బాలన్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర చేయబోతున్నట్టు కొన్ని వార్తలు బయటకొచ్చాయి.
అయితే తాజా సమాచారం ప్రకారం ఆ వార్తల్లో వాస్తవం లేదట. విద్యా బాలన్‌ను ఈ సినిమా కోసం ఎవరూ సంప్రదించలేదన్న చర్చ బీ టౌన్‌లో వినిపిస్తోంది. అందువల్ల ఆమె ఈ సినిమాలో ఉండే అవకాశాలు లేవన్నది స్పష్టమవుతోంది.
ఇక షూటింగ్ విషయానికి వస్తే, రెగ్యులర్ షెడ్యూల్‌ను ప్రారంభించేందుకు పూరి త్వరలోనే రంగంలోకి దిగనున్నట్టు తెలుస్తోంది.