తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతానికి రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. వాటిలో ఒక సినిమా ఇప్పటికే రిలీజ్‌కు రెడీగా ఉంది. మరో సినిమా షూటింగ్ దశలో కొనసాగుతోంది. అయితే ఇవే కాకుండా రజినీ తదుపరి సినిమాలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం బయటకి రాలేదు. కానీ ఇప్పుడు కొత్తగా ఓ ఇంట్రెస్టింగ్ బజ్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం, తలైవర్ తన నెక్స్ట్ సినిమా కోసం యువ దర్శకుడు హెచ్ వినోద్‌తో కలిసి పని చేయబోతున్నాడట. ప్రస్తుతం వినోద్ దళపతి విజయ్‌తో “జన నాయగన్” అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా పనుల్లో ఉన్న సమయంలోనే రజినీకాంత్‌ను రెండు సార్లు కలిశాడట, ఈ సమావేశాల తరువాతే ఇద్దరి కాంబినేషన్ ఫిక్స్ అయ్యిందన్న టాక్ సోషల్ మీడియాలో గట్టిగానే ట్రెండ్ అవుతోంది.
వినోద్ గతంలో ఖాకీ, వలిమై, తునివు లాంటి సీరియస్ అండ్ మాస్ సినిమాలతో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పుడు కార్తీతో ఖాకీ 2 అనే మరో ప్రాజెక్ట్ కూడా చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇలాంటి బ్యాక్‌డ్రాప్ ఉన్న డైరెక్టర్‌తో రజినీకాంత్ కలిసి సినిమా చేయబోతున్నాడంటే అంచనాలు భారీగా పెరగడం ఖాయం.
ఇకపోతే ఇది కేవలం బజ్ మాత్రమేనని, అధికారికంగా ఏం ప్రకటించలేదు. కానీ ఈ కాంబినేషన్ రియాలిటీ అయితే, అది రజినీ కెరీర్‌లో మరో మాస్ అండ్ ఇంటెన్స్ సినిమాగా నిలవనుంది.
