తమిళ స్టార్ హీరో సూర్య చాలా కాలంగా తెలుగు ప్రేక్షకులకు డైరెక్ట్ సినిమా ఇవ్వాలనే ఆసక్తితో ఉన్నాడు. ఇన్నాళ్ల ఎదురుచూపులకు తెర వేస్తూ, చివరికి ఆయన వెంకీ అట్లూరితో ఒక తెలుగు ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ కాంబోలో రూపొందనున్న సినిమా పూజా కార్యక్రమం ఇటీవల హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో జరగడంతో ఇది అధికారికంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి చిత్రబృందం మొత్తం హాజరైంది.
ఈ మూవీ షూటింగ్ త్వరలోనే మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక కథానాయికతో పాటు ఇతర ముఖ్యమైన పాత్రలు ఎవరు చేస్తారనే విషయాలపై త్వరలోనే నిర్మాణ సంస్థ స్పష్టత ఇవ్వనుంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం, సంగీతం విషయంలో జీవీ ప్రకాష్ ఇప్పటికే వర్క్ ప్రారంభించేశాడు. వెంకీ అట్లూరితో కలిసి సూర్య సినిమాకి ట్యూన్లు కంపోజ్ చేస్తున్నాడు.
అదే సమయంలో, హీరోయిన్ విషయంలో మొదట భాగ్యశ్రీ భోర్సే పేరు వినిపించింది. కానీ తాజా సమాచారం మేరకు ఆమె స్థానంలో కాయదు లోహర్‌ను ఎంపిక చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ కాంబినేషన్, కథ, మ్యూజిక్ అన్నీ బలంగా ఉండటంతో సినిమా పై అంచనాలు బాగానే ఉన్నాయి. విడుదల తర్వాత ఈ ప్రాజెక్ట్ ఎంత వాణిజ్య విజయాన్ని సాధిస్తుందో వేచి చూడాలి.