సర్‌ప్రైజ్! అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన తాజా సినిమా ‘తండేల్’ మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను డైరెక్టర్ చందూ మొండేటి డైరెక్ట్ చేయగా, పూర్తి లవ్ స్టోరీ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాని తెరకెక్కించారు.
ఇక ఈ సినిమా థియేటర్లలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురూ చూస్తున్నారు. అయితే, ‘తండేల్’ మూవీని థియేటర్లలో చూసే ప్రేక్షకులకు ఓ సాలిడ్ సర్‌ప్రైజ్ ఇవ్వనున్నాడు యంగ్ హీరో శ్రీవిష్ణు. ఆయన నటిస్తున్న తరువాత సినిమాకి సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను ‘తండేల్’ విడుదల అవుతున్న థియేటర్లలో ప్రేక్షకుల.
SV18 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను దర్శకుడు కార్తీక్ రాజు డైరెక్ట్ చేస్తున్నారు. ఇది పూర్తి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ సినిమాగా రానున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. దీంతో ఈ సినిమాకు ఎలాంటి టైటిల్ ఫిక్స్ చేస్తారా.. ఇందులో శ్రీవిష్ణు ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నాడా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.