తెలుగులో జీరో బజ్ తో స్టార్ హీరో మూవీ! సంక్రాంతి తర్వాత అటు తెలుగుతో పాటు ఇటు తమిళ సినిమా దగ్గర మంచి బజ్ తో సినిమాలు ఏవి పెద్దగా విడుదల కాలేదు. కానీ ఈ ఫిబ్రవరిలో మాత్రం పలు ప్రముఖ సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో సందడి చేసేందుకు వస్తున్నాయి.
అయితే ఈ సినిమాల్లో అక్కినేని హీరో నాగ చైతన్య యాక్ట్ చేసిన తండేల్ మూవీ ఒకటి కాగా తమిళ్ నుంచి స్టార్ హీరో అజిత్ కుమార్ యాక్ట్ చేసిన మోస్ట్ అవైటెడ్ సినిమా “పట్టుదల” కూడా ఓ మూవీగా రానుంది. అయితే వీటిలో అజిత్ సినిమాకి మాత్రం తెలుగులో జీరో బజ్ తోనే వస్తుందని తెలుస్తుంది. మేకర్స్ లాస్ట్ మినిట్ లో తెలుగు వెర్షన్ ని ప్రకటించారు.
కానీ ఈ సినిమా కనీసం మినిమమ్ ప్రమోషన్స్ కూడా తెలుగులో చేసుకోలేకపోయింది. మరి లాస్ట్ టైం తెగింపు సినిమాకి కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. మరి ఈ సినిమాకి ఎలాంటివో ఓపెనింగ్స్ తెలుగులో రానున్నాయో వేచి చూడాల్సిందే.