బాలయ్య తో కిస్సిక్‌ అనిపించిన శ్రీలీల

Saturday, December 7, 2024

యంగ్ బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంది. దాదాపు అందరు హీరోలతో ఈ బ్యూటీ సినిమాలు రెడీగా ఉన్నాయని చెప్పుకొవచ్చు. ఇప్పటికే మహేష్ బాబు లాంటి స్టార్ హీరోతో కూడా నటించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మరో స్టార్ హీరో అల్లు అర్జున్‌తో కలిసి డ్యాన్స్ ఇరగదీసింది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప-2’ డిసెంబర్ 5న గ్రాండ్ విడుదలకు సిద్దంగా ఉంది. ఈ సినిమాను డైరెక్టర్‌  సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. అయితే, ఈ సినిమాలో ‘కిస్సిక్’ అనే స్పెషల్ ఐటెం సాంగ్‌లో శ్రీలీల బన్నీతో కలిసి అదిరిపోయే డ్యాన్స్ స్టెప్పులు వేసింది.

ఈ పాటను తాజాగా విడుదల చేయగా, దీనికి ట్రెమెండస్ రెస్పాన్స్ అందింది. ఇప్పుడు తన ‘కిస్సిక్’ సాంగ్‌లోని హూక్ స్టెప్‌ని నందమూరి బాలకృష్ణతో వేయించింది ఈ ముద్దుగుమ్మ. బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్‌బికె’ టాక్ షోలో శ్రీలీల అతిథిగా వచ్చింది.

ఈ క్రమంలో ఆమె తన ‘కిస్సిక్’ స్టెప్‌ను బాలయ్యతో పాటు చేయడం ప్రేక్షకులను కట్టిపడేసింది. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles