తెలుగులో వస్తున్న శ్రీ గాంధారి!

Sunday, December 8, 2024

ప్రస్తుతం హారర్ జోనర్ సినిమాలకి మంచి ఆదరణ ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రముఖ హీరోయిన్ హన్సిక లీడ్ రోల్ లో చేస్తున్న సినిమా ‘శ్రీ గాంధారి’. మసాలా పిక్స్ బ్యానర్‌పై ఆర్ కన్నన్ డైరెక్షన్ కమ్‌ ప్రొడ్యూస్ చేస్తున్న మూవీ ఇది. ఇక ఈ సినిమాని సరస్వతి డెవలపర్స్‌తో కలిసి లచ్చురం ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రాజు నాయక్ తెలుగులో విడుదల చేయనున్నారు.

ఈ మూవీని వీకేఆర్ (విక్రమ్ కుమార్ రెజింతల) నిర్మిస్తున్నారు.ఈ చిత్రంలో హిందూ ట్రస్ట్ కమిటీకి హెడ్ ఆఫీసర్‌గా పనిచేసే యువతిగా హన్సిక  నటించారు. ఆమె ‘గంధర్వ కోట’ పురాతన స్మారకానికి సంబంధించిన పరిశోధన ప్రాజెక్ట్‌ను చేపట్టడంతో అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఒక రాజు నిర్మించిన శతాబ్దాల నాటి ఈ కోటలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. ఆ రహస్యాల్ని ఎలా బయటకు తీసుకు వచ్చారు? అనేది మూవీ కథ.

శ్రీ గాంధారి కథను తొల్కప్పియన్, స్క్రీన్ ప్లేని ధనంజయన్ ఇచ్చారు. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా బాల సుబ్రమణియన్, మ్యూజిక్ కంపోజర్‌గా ఎల్వీ గణేష్ ముత్తు, ఎడిటర్‌గా జిజింత్ర, సిల్వా స్టంట్ డైరెక్టర్‌గా చేశారు. మిస్టరీ, సస్పెన్స్, హారర్, థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘శ్రీ గాంధారి’ చిత్రాన్ని డిసెంబర్‌లో గ్రాండ్‌గా రిలీజ్‌ చేసేందుకు రాజు నాయక్ ప్లాన్ చేస్తున్నారు

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles