స్పెషల్‌ విషెస్‌!

Saturday, December 7, 2024

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, అందాల భామ లావణ్య త్రిపాఠి గతేడాది ప్రేమవివాహం చేసుకున్నారు. తమ ప్రేమను ఇరు కుటుంబాలు అంగీకరించడంతో వారి పెళ్లి ఎంతో వేడుకగా జరిగింది. అయితే, వారి పెళ్లయ్యి అప్పుడే ఏడాది గడిచిపోయిందంట. ఈ విషయాన్ని వరుణ్ తేజ్ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్‌లో చెప్పాడు

తన భార్యకు తొలి యానివర్సరీ విషెస్ చెబుతూ ఓ రొమాంటిక్ ఫోటోను పోస్ట్ చేశాడు ఈ మెగా ప్రిన్స్‌. ఇటీవల వారు స్విట్జర్లాండ్ వెకేషన్‌కు వెళ్లినప్పుడు దిగిన ఓ ఫోటోను వరుణ్ ఈ సందర్భంగా పోస్ట్ చేశాడు. మెగా కపుల్‌గా ఈ జోడీ అందరి మన్ననలు అందుకుంటోంది.

ఇక వరుణ్ తేజ్, లావణ్య ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా కుటుంబ సభ్యులతో పాటు పలువురు సెలబ్రిటీలు, అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే, వరుణ్ తేజ్ ‘మట్కా’ సినిమాతో ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles