స్పెషల్ థాంక్యూ సార్! టాలీవుడ్ నుంచి విడుదలకి వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “తండేల్”. అక్కినేని యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా పట్ల మంచి బజ్ నెలకొంది.
అయితే ఈ సినిమా మేకర్స్ ఇపుడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే ఉప ముఖ్యమంత్రి, తెలుగు సినిమా స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఏపీలో తండేల్ సినిమాకి అదనపు ధరలు పర్మిషన్ ఇచ్చినందుకు గాను వారితో పాటుగా ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కి కూడా గీతా ఆర్ట్స్ సంస్థ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు.