రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న ప్రెస్టీజియస్ మూవీ ‘కింగ్డమ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
ఇక ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా ఓ సాలిడ్ అప్డేట్ని ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చారు. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను త్వరలోనే రిలీజ్ చేసేందుకు వారు సిద్ధమవుతున్నారట. ఈ చిత్ర ఫస్ట్ సింగిల్ సాంగ్ అనౌన్స్‌మెంట్‌తో పాటు పాటను కూడా ఈ వారంలో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నట్లు చిత్ర నిర్మాత నాగవంశీ పేర్కొన్నారు.
దీంతో ఈ సినిమా నుంచి రాబోయే ఫస్ట్ సింగిల్ సాంగ్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో అందాల భామ భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్గా నటిస్తుండగా అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మే 20న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది.