పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పీరియడ్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు పైన మరోసారి హైప్ పెరుగుతోంది. ఈ సినిమాను జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ పక్కన నిధి అగర్వాల్ కథానాయికగా కనిపించనుంది. చాలా కాలంగా ఆగిపోయిన ఈ ప్రాజెక్ట్ ఎట్టకేలకు పూర్తి దశకు చేరుతున్నట్లు సమాచారం.
ఇప్పటికే సినిమా విడుదల జూన్ లో జరగవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో, ఇప్పుడు అందరి దృష్టి ట్రైలర్ మీదే నిలిచింది. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ఇప్పటికే సిద్ధంగా ఉందట. ట్రైలర్ కట్ చాలా గ్రాండ్ గా, థ్రిల్లింగ్ గా ఉండబోతుందన్న టాక్ ఇండస్ట్రీలో హీట్ పెంచుతోంది.
ట్రైలర్ చూడగానే ప్రేక్షకుల్లో ఆసక్తి మామూలుగా ఉండదని, పవన్ మాస్ లుక్ తో పాటు విజువల్స్ కూడా సినిమాపై అంచనాలను పెంచేలా ఉంటాయని వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్ మీద ఇప్పటికే అభిమానుల్లో ఒక ప్రత్యేకమైన ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో ట్రైలర్ విడుదలకు మరింత వెయిటింగ్ నెలకొంది. త్వరలోనే ట్రైలర్ డేట్ అనౌన్స్ అయ్యే అవకాశముంది.
ఇక మొత్తంగా చూస్తే హరిహర వీరమల్లు మళ్లీ వార్తల్లోకి రావడానికి ఇది మంచి టైమింగ్ గా చెప్పొచ్చు. ట్రైలర్ విడుదల తరువాత సినిమాపై ఉన్న ఆసక్తి ఇంకాస్త పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.