ఊర మాస్‌ యాక్షన్‌ తో అదరగొట్టిన ఇస్మార్ట్‌ శంకర్‌!

Thursday, February 6, 2025

మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లకి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పెట్టింది పేరని చెప్పుకొవచ్చు. సినిమా రిజల్ట్‌ తో సంబంధం లేకుండా హీరోలను మాస్‌ గెటప్స్‌ లో చూపిస్తూ ప్రేక్షకులను తన సినిమాలు చూసేటట్లు చేయడంలో పూరి దిట్ట. ఇప్పుడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తో డబుల్ ఇస్మార్ట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి సీక్వెల్ గా ఈ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని ఆగస్టు 15 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి విడుదల చేయబోతున్నారు మూవీ మేకర్స్‌. ఈ పాన్ ఇండియా సినిమాలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే.

సినిమా విడుదలకి  ఇంకా 15 రోజులే ఉండటంతో మేకర్స్ ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు. రామ్ పోతినేని లేటెస్ట్ స్టిల్ ను విడుదల చేయగా, ఆ స్టిల్‌ ఆడియెన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఊర మాస్ స్వాగ్ తో రామ్ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. సిగరెట్ తాగుతూ కనిపిస్తున్న ఈ స్టిల్ కొద్ది సేపటికే వైరల్ గా మారింది. ఇక ఈ చిత్రంలో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తుండగా, మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles