యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన థగ్ లైఫ్ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. త్రిష, అభిరామిలు కథలో కీలక పాత్రలు పోషించగా, ఈ ప్రాజెక్ట్‌కి ఎఆర్ రెహమాన్ సంగీతం అందించారు. కానీ, సినిమా విడుదల తర్వాత ప్రేక్షకుల్లో ఆశించినంతగా ఆకట్టుకోలేకపోయింది. తెలుగు, తమిళ భాషల్లోనూ ఈ సినిమా ఆశించిన విజయం సాధించలేదు.
సినిమా రిజల్ట్ విషయంలో ఈ ప్రాజెక్ట్‌కి ఎదురైన అపజయం ఓటిటి రిలీజ్‌పై ప్రభావం చూపినట్లు వినిపిస్తోంది. అసలే మేకర్స్ ఈ సినిమాని థియేటర్లకు వచ్చిన ఎనిమిది వారాల తర్వాతే ఓటిటిలో రిలీజ్ చేస్తామంటూ ముందే ప్రకటించారు. అయితే, ఫలితం నిరాశపరిచిన తర్వాత ఆ నిర్ణయంలో మార్పు చేసే దిశగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం వస్తోంది.
ఇప్పుడు ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ ఓటిటి ప్లాట్‌ఫారమ్ నెట్‌ఫ్లిక్స్ వద్ద ఉన్నాయన్న సంగతి తెలిసిందే. తాజా బజ్ ప్రకారం మేకర్స్ నెట్‌ఫ్లిక్స్‌తో ఓ ముందస్తు స్ట్రీమింగ్ రిలీజ్ కోసం చర్చలు జరుపుతున్నట్లు టాక్. అయితే దీనిపై అధికారిక సమాచారం మాత్రం ఇంకా బయటకు రాలేదు.
ఈ చిత్రాన్ని కమల్ హాసన్‌తో పాటు మణిరత్నం, ఆర్ మహేంద్రన్ కలిసి నిర్మించారు. కథ, టెక్నికల్ పరంగా ఉన్న స్ట్రాంగ్ బేస్ ఉన్నా కూడా ప్రేక్షకులను థియేటర్‌లకు రప్పించడంలో ఈ సినిమా వెనకబడ్డట్లు స్పష్టమవుతోంది. ఓటిటి విడుదలను వేగవంతం చేస్తారా? లేక మొదటి ప్లాన్‌నే ఫాలో అవుతారా? అన్నది మరికొద్ది రోజుల్లో క్లారిటీ వస్తుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.