శివాజీ సాలిడ్ కమ్‌ బ్యాక్‌!

Friday, March 28, 2025

శివాజీ సాలిడ్ కమ్‌ బ్యాక్‌! న్యాచురల్ స్టార్ నాని ప్రొడక్షన్ కంపెనీ వాల్ పోస్టర్ సినిమా నుంచి వచ్చిన లేటెస్ట్ చిత్రం ‘కోర్ట్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. మార్చి 14న వరల్డ్‌వైడ్ థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అవుతున్న ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్స్ ఇప్పటికే పడ్డాయి. దీంతో ఈ సినిమా చూసిన వారు ‘కోర్ట్’ చిత్రాన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

దర్శకుడు రామ్ జగదీష్ తీసుకున్న పాయింట్ చాలా చక్కగా ఉందని.. దాన్ని ప్రెజెంట్ చేసిన తీరు అద్భుతంగా ఉందంటూ ప్రశంసిస్తున్నారు. అయితే, ‘కోర్ట్’ సినిమాలో అందరినీ ఇంప్రెస్ చేసిన విషయం మాత్రం నటుడు శివాజీ పర్ఫార్మెన్స్. చాలా రోజుల తర్వాత ‘కోర్ట్’ సినిమాతో శివాజీ సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చారని సినిమా చూసిన వారు అంటున్నారు. మంగపతి అనే నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో శివాజీ నటన అద్భుతంగా ఉందని.. ఈ సినిమాకు ఆయన నటన మేజర్ హైలైట్‌గా నిలిచిందని వారు అంటున్నారు.

తన పాత్రను చాలా ఈజ్‌గా పర్ఫార్మ్ చేసిన శివాజీ, టాలీవుడ్‌లో మరో విలన్ రెడీ అయ్యాడనే సూచనలు పంపాడని పలువురు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి శివాజీ ‘కోర్ట్’ మూవీతో ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటున్నాడు. మరి ఈ సినిమాతో ఆయనకు ఎలాంటి ఆఫర్స్ వస్తాయో చూడాలి. ఇక కోర్ట్ చిత్రంలో ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles