రుషికొండలో జగన్మోహన్ రెడ్డి తన అహంకారానికి నిదర్శనంగా నిర్మించిన భవంతులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం నాడు పరిశీలించారు. అక్కడి హంగులు ఆర్భాటాలు చూసి.. ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కూడా ఇలాంటివి నిర్మించడం అనేది ఊహకు అందే విషయమైనా అని నివ్వెరపోయారు. అసలు ఈ భవనాలను ఇప్పుడు ఏం చేసుకోవాలో తెలియడం లేదని అన్నారు. రాష్ట్రం మొత్తం జగన్ వ్యవహారాలను ఈసడించుకునే స్థాయిలో రుషికొండ విలాసాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే జగన్ తరఫు నీలిదళాలు సిగ్గులేకుండా ఈ పనులను సమర్థించుకునే ప్రయత్నం చేస్తుండడం.. ఎదరు చంద్రబాబు మీదనే నిందలు వేస్తుండడం ఏవగింపు పుట్టిస్తోంది.
జగన్ నీలిదళాలు చేస్తున్న వాదన ఏంటంటే.. అమరావతిలో సచివాలయం కోసం, హైకోర్టుకోసం ఎలాగైతే ఐకానిక్ భవనాలు కట్టాలని చంద్రబాబునాయుడు అనుకుంటున్నారో.. అదే విధ:గా.. విశాఖపట్టణం కోసం జగన్ తలపెట్టిన ఐకానిక్ భవనాలే.. ఈ భవంతులట. చంద్రబాబు నాయుడు చేస్తున్న ఆలోచనలో కూడా అవి భారీ వ్యయంతో కూడుకున్నవే. అయితే అవి ప్రజావసరాలకు ఉద్దేశించినవి.రాష్ట్రప్రతిష్ఠను పెంచేవి. అంతే తప్ప ఒక వ్యక్తి యొక్క నివాసానికి ఉద్దేశించినవి కానే కాదు. జగన్ తన నివాసం కోసం మరియు తన ఇద్దరు కూతుళ్ల కాపురాల కోసం ఆ మూడు భవంతులను కట్టించుకున్నారనేది జగమెరిగిన సత్యం. తాను రాష్ట్రానికి శాశ్వతంగా ముఖ్యమంత్రిగానే ఉంటాడు గనుక.. ఆ విలాస వంతమైన భవనాలను అనుభవించాలని అనుకున్నారు. ప్రజలు ఎన్నికల్లో ఓటుతో ఛీకొట్టడంతో ఈ కలలన్నీ వికటించాయి. తాడేపల్లి- యలహంక- ఇడుపులపాయ మధ్య షటిల్ సర్వీసులాగా తయారైంది ఆయన పరిస్థితి. రుషికొండ ఒక ఐకానిక్ భవనం అంటూ ఇప్పుడు తన వందిమాగధులకు దబాయింపజేస్తున్నారు.
ఇంతకంటె సిగ్గుమాలిన సమర్థింపు ఏంటంటే.. చంద్రబాబునాయుడు వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయ భవనాలకు వెయ్యి కోట్లు ఖర్చు పెట్టారట. కాబట్టి జగన్ తన నివాసం కోసం
శాశ్వత భవనాల కోసం ఇలా 600 కోట్ల దాకా తగలేయడం తప్పు కాదట. చంద్రబాబునాయుడు నిర్మించినవి తాత్కాలిక భవనాలు కానే కాదు. భవనాలు శాశ్వతమైనవి.. ఐకానిక్ సచివాలయం వచ్చిన తర్వాత ఈ భవనాల్లో ఇతర ప్రభుత్వ శాఖల కార్యాలయాలు నడుపుకోవాలనేది ప్లాన్. ఈ ఇంగితం కూడా లేకుండా జగన్ దళాలు చేస్తున్న విష ప్రచారాలు ప్రజలకు చీదర పుట్టిస్తున్నాయి. చూడబోతే ఒక లడ్డూ వివాదం లాగా జగన్ మోహన రెడ్డిని కుటిలత్వాన్ని ప్రజల ఎదుట గట్టిగా నిరూపించడానికి ఈ రుషికొండ వాస్తవాలు కూడా పనిచేస్తాయని ఆదళం భయపడుతున్నట్లుంది.
సిగ్గులేకుండా సమర్థించుకోవడం కూడానా?
Thursday, December 5, 2024