ప్రస్తుతం సౌత్ ఇండియా సినిమా దగ్గర ఉన్నటువంటి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో తన మ్యూజిక్ తో ఓ రేంజ్ హైప్ ని ఇచ్చే సంగీత దర్శకుడు రవి బసృర్ కూడా ఒకరు. కేజీయఫ్, సలార్ లాంటి సినిమాలకి మైండ్ బ్లాకింగ్ మ్యూజిక్ ని ఇచ్చి అదరగొట్టిన రవి బసృర్ సంగీతం అంటే ఆడియెన్స్ లో మంచి క్రేజ్ ఉంటుందనే సంగతి తెలిసిందే.
ఇలా ప్రస్తుతం తాను పలు భారీ చిత్రాలకి వర్క్ చేస్తున్నారు. తాజాగా మన టాలీవుడ్ సచిత్ర రచయిత సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి ఓ పిక్ షేర్ చేసుకొని ఓ భారీ సినిమాకి ప్రస్తుతం మ్యూజిక్ సెషన్స్ తో కలిసి పని చేస్తున్నట్టుగా తెలియజేశారు. మరి ఆ సినిమానే యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా “స్వయంభు” కి వీరు కలిసి నటిస్తున్నారంట.
భగవాన్ హనుమంతుని ఆశీస్సులతో ఈ సినిమా మ్యూజిక్ సెషన్స్ చేస్తున్నట్టుగా ఓ పిక్ షేర్ చేసిన శాస్త్రి అందరికీ తెలియజేశారు. మరి ఈ భారీ ప్రాజెక్ట్ మ్యూజిక్ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.