ఆర్జీవి ఓవరాక్షన్.. ఏకంగా 11 గంటలు విచారణ!

Friday, November 14, 2025

పోలీసులకు అడ్డదిడ్డమైన జవాబులు ఇవ్వడంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను మించిపోతున్నట్టుగా కనిపిస్తోంది. ఏ సమాధానం చెబితే ఎలా ఇరుక్కుపోతామో, ఎలా అరెస్టు అవుతామో అనే భయంతో.. అడిగిన ప్రశ్నలకు సూటిగా ఒక్క జవాబు కూడా ఇవ్వకుండా, తెలియదు గుర్తులేదు సంబంధం లేదు లాంటి స్టీరియోటైపు నాటకపు జవాబులతో పోలీసులను విసిగెత్తించడంలో రాంగోపాల్ వర్మ కూడా ఆరితేరిపోయినట్టుగా ఉంది. మార్ఫింగ్ ఫోటోలతో కూటమి పార్టీల నాయకులను అవమానిస్తూ ఎక్స్ లో పెట్టిన పోస్టులకు సంబంధి రాంగోపాల్ వర్మ కేసు ఎదుర్కొంటున్నారు. అయితే పోలీసులకు సహకరించకుండా సుదీర్ఘకాలం సాగదీసిన ఆయన మంగళవారం రెండోసారి ప్రకాశం జిల్లా పోలీసుల ఎదుట హాజరయ్యారు. అక్కడకూడా ప్రశ్నలకు స్ట్రెయిట్ గా జవాబులివ్వకపోవడంతో.. పోలీసులు రాంగోపాల్ వర్మను ఏకంగా 11 గంటలపాటు ప్రశ్నలు అడగాల్సి వచ్చింది.

రాంగోపాల్ వర్మ.. వ్యూహం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా.. అనేక దిగజారుడు టెక్నిక్ లను ఫాలో అయిన సంగతి అందరికీ తెలిసిందే. కేవలం డబ్బు ఒక్కటే ప్రయారిటీగా భావించుకున్న రాంగోపాల్ వర్మ.. తనకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆఫర్ కు బుట్టలో పడ్డారు. జగన్ మహానుభావుడని కీర్తించేలా.. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతర రాజకీయ పరిణామాలు అనేది సబ్జెక్టుగా తీసుకుని.. జగన్ ను మహానుభావుడిగా ప్రొజెక్టు చేసేందుకు తన వంతుగా ఒక సినిమా తీసిపెట్టేందుకు బేరం మాట్లాడుకున్నారు. నిజానికి ఈ సినిమా చేయడానికి రామూకు బ్లాక్ మనీ రూపంలో అతిపెద్ద మొత్తమే ముట్టినట్టుగా అప్పట్లో ప్రచారం జరిగింది.

రకరకాల వక్ర ప్రచారాలతో కూడిన స్క్రిప్టుతో ఆయన వ్యూహం సినిమా వండిన తర్వాత అది బాక్సాఫీసు వద్ద సర్వనాశనం అయిపోయింది. కనీసం రాష్ట్రంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆ సినిమాను చూసి ఉన్నా.. ఎంతో కొంత ఆడేది. కానీ.. ఏమాత్రం భరించలేనట్టుగా సినిమా తయారైంది. సినిమా చండాలంగా రావడంతో, అప్పటికే ప్రకటించిన వ్యూహం 2 సినిమా సంగతి మరచిపోవాలని జగన్మోహన్ రెడ్డి రాంగోపాల్ వర్మను మందలించినట్టుగా కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇంత జరిగినా ఏపీ ఫైబర్ నెట్ నుంచి అప్పట్లో రాంగోపాల్ వర్మకు రెండు కోట్లరూపాయల చెల్లింపులు చేసినట్టు కూడా వార్తలువచ్చాయి.

సూపర్ ఫ్లాప్ అయిన ఈ వ్యూహం సినిమాను జాకీలు వేసి లేపడానికి వర్మ చాలా కష్టపడ్డారు. చంద్రబాబు, పవన్, లోకేష్ ఫోటోలను మార్ఫింగ్ చేయించి ట్వీట్ చేయడమే ఇప్పుడు ఆయన మీద కేసు. బిడ్డచచ్చినా పురిటి వాసన పోలేదన్నట్టుగా.. సినిమా భ్రష్టుపట్టిపోయింది గానీ.. ఆ సినిమా తాలూకు వివాదాలు వర్మను చుట్టుముట్టుకునే ఉన్నాయి. ఒంగోలు పోలీసులు వర్మను ఏకంగా 11 గంటలు విచారించినప్పటికీ, ఆయన సహకరించలేదని తెలుస్తోంది. సూటిగా సమాధానాలు చెప్పలేదని తెలుస్తోంది. ఈ కేసులో పోలీసులు వర్మను మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉన్నదని అంతా అనుకుంటున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles