తంజావూరులో పవన్ ఆధ్యాత్మిక యాత్ర! జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా పలు పుణ్యక్షేత్రాలను దర్శిస్తున్నారు. ఈ యాత్రలో భాగంగా గురువారం ఆయన తంజావూరుకు సమీపంలోని స్వామిమలైని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ స్వామినాథ స్వామిని దర్శించుకుని, కంద షష్టి కవచ పారాయణం లో పాల్గొన్నారు. అర్చకులు ఆయనకు ఆశీర్వచనం అందించారు. స్వామినాథ స్వామి దర్శనానంతరం ఆలయంలో వెలసిన ఆదిదంపతులు శ్రీ సుందరేశ్వరన్ స్వామి, మీనాక్షి అమ్మవార్లకు పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక ఈ యాత్రలో పవన్ కళ్యాణ్‌తో పాటు ఆయన కుమారుడు అకీరా నందన్, తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మెంబర్ ఆనంద్ సాయి కూడా పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ ఆధ్యాత్మిక యాత్రకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.