పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమాల్లో హరిహర వీరమల్లు ఒకటి. ఎన్నో మార్లు రిలీజ్ తేదీ మారుతూ అభిమానులను నిరాశపరచిన ఈ సినిమా, ఇప్పుడు మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా మేకర్స్ అందించిన అప్‌డేట్‌తో ఈ సినిమా చివరకు రిలీజ్‌కు సిద్ధమవుతోందని స్పష్టమైంది.
పెరిఅడ్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా భారీ అంచనాల మధ్య తెరకెక్కుతోంది. పవన్ కళ్యాణ్ ఓ పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో కనిపించబోతుండటంతో అభిమానుల్లో ఆసక్తి ఇంకాస్త పెరిగింది. ఇప్పటివరకు వచ్చిన టీజర్లు, గ్లింప్స్‌కు చాలా బాగా స్పందన వచ్చింది. ప్రతి ఒక్క కంటెంట్‌కి సోషల్ మీడియాలో ఫుల్ హైప్ వచ్చింది. దీన్ని బట్టి సినిమాపై జనాల్లో ఎంతగా ఎగ్జైట్‌మెంట్ ఉందో అర్థమవుతుంది.
ఇప్పటికే ఈ చిత్రం రిలీజ్ విషయంలో అనేకసారి మార్పులు జరిగినా, ఇప్పుడు మేకర్స్ జూలై 24న థియేటర్లలోకి తీసుకొస్తామంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రకటనతో సినిమా కోసం ఎదురుచూస్తున్నవాళ్లలో కొత్త ఉత్సాహం వచ్చింది. మరోవైపు ఈ చిత్రాన్ని కేరళలో స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ తన బ్యానర్ ద్వారా రిలీజ్ చేయబోతున్నట్టు అధికారికంగా వెల్లడించారు.
ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ నుంచి బాబీ డియోల్ విలన్‌గా కీ రోల్ చేస్తున్నాడు. సంగీతంలో మ్యూజిక్ మాస్ట్రో ఎం.ఎం. కీరవాణి అదిరిపోయే ట్యూన్స్ అందిస్తున్నారు. నిర్మాత ఏ.ఎం. రత్నం ఈ సినిమాని చాలా భారీ బడ్జెట్‌తో గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నాడు.
ఇప్పుడున్న ట్రెండ్ చూస్తే, ఈ సినిమా థియేటర్స్‌కి వచ్చేసరికి బాక్సాఫీస్ దగ్గర పవన్ కళ్యాణ్ మళ్లీ తన స్టామినా చూపించబోతున్నట్టు సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.