రాజమౌళి- మహేష్‌ సినిమాలో అవకాశం..క్లారిటీ ఇచ్చిన కట్టప్ప!

Saturday, October 12, 2024

బాహుబలి ఫేమ్‌ సత్యరాజ్‌, వసంత్‌ రవి ప్రధాన పాత్రల్లో గుహన్‌ సెన్నియ్యప్పన్‌ రూపొందిస్తున్న చిత్రం వెపన్‌. ఈ చిత్రంలో తాన్యా హోప్‌, యాషికా ఆనంద్, రాజీవ్‌ మేనన్‌, రాజీవ్‌ పిళ్లై, కనిహ తదితరులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. జూన్‌ 7న వెపన్‌ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సత్యరాజ్‌ అలియాస్ కట్టప్ప.. ఎస్ఎస్ రాజమౌళి-మహేశ్‌ బాబు ప్రాజెక్ట్‌లో అవకాశంపై మాట్లాడారు.

రాజమౌళి-మహేశ్‌ ప్రాజెక్ట్‌లో మీరు నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.. నిజమేనా? అని సత్యరాజ్‌ని ఓ రిపోర్టర్ అడగగా…‘డైరెక్టర్ రాజమౌళి కి నేను ఎప్పటికీ రుణపడి ఉంటా. బాహుబలి సినిమాతో ప్రపంచం మొత్తానికి నా గుర్తింపు కట్టప్పగా మారింది. యానిమేషన్‌ సిరీస్‌ వచ్చాక చిన్న పిల్లలు కూడా నన్ను కట్టప్పగానే గుర్తిస్తారని తెలుస్తుంది.

బాహుబలి సినిమాలో నాకు కండలు ఉన్నట్లు చూపించారు. యానిమేషన్‌ సిరీస్‌లో అయితే ఇంకా ఎక్కువగా చూపించారు. బయట నేను అలానే ఉంటానని పిల్లలు అనుకుంటారు. మహేశ్‌ బాబు, రాజమౌళి సినిమా కోసం ఇప్పటివరకు నన్నెవరూ సంప్రదించలేదు. రాజమౌళి నాకు పాత్ర ఇస్తాను అంటే వెంటనే అంగీకరిస్తాను అంటూ కట్టప్ప చెప్పుకొచ్చారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles