టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన సినిమా ‘ఖలేజా’ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ మూవీ అయిన సంగతి తెలిసిందే. కానీ, ఆ తర్వాత ఈ సినిమాకు టీవీలో వచ్చిన రెస్పాన్స్ ఎలాంటిదో అందరికీ తెలిసిన విషయమే.
ఈ సినిమాను తాజాగా రీ-రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పానవసరం లేదు. అయితే, ఈ సినిమాను థియేటర్లలో చూసేందుకు ప్రేక్షకులు చూపిస్తున్న ఆసక్తి ప్రస్తుతం ఆసక్తికరంగా ఉంది. ఈ సినిమాకు బుక్ మై షో లో గంటకు ఏకంగా 14 వేలకు పైగా టికెట్లు బుక్ అవుతుండటంతో ఈ సినిమాపై ఎలాంటి బజ్ ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు.
మరి ఈ సినిమాకు రీ-రిలీజ్‌కు ముందే ఇలాంటి హైప్ క్రియేట్ చేయడంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి ఏర్పడింది.