శ్రీలీల డ్యాన్స్‌ కు నితిన్‌ ఫిదా!

Saturday, December 7, 2024

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం రాబిన్‌హుడ్ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు వెంకీ కుడుముల డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

అయితే, ఈ షూటింగ్ మధ్యలో ఓ ఇంట్రెస్టింగ్ సీన్ చోటుచేసుకోగా, దానిని నితిన్ సోషల్ మీడియాలో షేర్‌ చేశాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా యంగ్ బ్యూటీ శ్రీలీల యాక్ట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, షూట్ మధ్యలో ఆమె తనకు నచ్చిన విధంగా ముసుగువేసుకుని, డ్యాన్స్ స్టెప్పులు వేసింది. ఇది చూసి నితిన్ అవాక్కయ్యాడు.

అంతేగాక, ‘‘ఇది మహిళా లోకం భయ్యా.. చప్పట్లు కొట్టి అభినందించడం తప్ప ఏమీ చేయలేను’’ అంటూ కామెంట్లు పెట్టాడు. శ్రీలీల డ్యాన్స్ వేస్తున్నప్పుడు నితిన్ ఎక్స్‌ప్రెషన్స్ అభిమానులకు నవ్వులు తెప్పిస్తున్నాయి. ‘రాబిన్‌హుడ్’ చిత్ర షూటింగ్ సమయంలో శ్రీలీల అల్లరికి నితిన్ ఇంకా ఎన్నిసార్లు అవాక్కయ్యాడో.. అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles