డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్న ఎన్‌.శంకర్‌ కుమారుడు!

Friday, March 28, 2025

తెలుగు చిత్ర పరిశ్రమలో శ్రీరాములయ్య, ఎన్‌కౌంటర్‌, జయం మనదేరా, భద్రాచలం, జై భోలో తెలంగాణ వంటి సంచలన విజయాలు సాధించిన చిత్రాలను డైరెక్ట్ చేసిన డైరెక్టర్‌ ఎన్.శంకర్ గురించి అందరికీ తెలిసిందే. అప్పట్లో ఈ చిత్రాలు ఎలాంటి ప్రేక్షకాదరణ పొందాయో తెలిసిన విషయమే.

తాజాగా ఎన్‌.శంకర్‌ తనయుడు దినేష్ మహీంద్ర కూడా తండ్రి బాటలో దర్శకత్వ ప్రతిభను నిరూపించుకోవడానికి సిద్ధం అవుతున్నాడు.
ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో దర్శకత్వ విభాగంలో శిక్షణ పొంది, స్క్రీన్‌ప్లే విషయంలో పలు కోర్సులను పూర్తిచేశాడు దినేష్ మహీంద్ర. త్వరలోనే దినేష్ మహీంద్ర డైరెక్షన్‌ లో ఓ ఫీల్‌ గుడ్‌ లవ్‌స్టోరీ రూపుదిద్దుకోబోతుంది. కొత్త తారలతో పాటు నూతన టెక్నిషియన్లను పరిచయం చేస్తూ యూత్‌ఫుల్‌ ఫీల్‌ గుడ్ లవ్‌స్టోరీగా రూపొందనున్న ఈ చిత్రాన్ని ‘‘ఆరెక్స్ క్రియేషన్స్’’ సంస్థ నిర్మిస్తుంది.

ఈ మూవీ షూటింగ్‌ ఏప్రిల్‌లో ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పాటల రికార్డింగ్స్ జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles