వచ్చే నెలలోనే నా పెళ్లి!

Sunday, December 8, 2024

నటి కీర్తి సురేశ్‌ పెళ్లి ముహుర్తం కుదిరింది. వచ్చే నెలలో ఆమె వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నట్లు స్వయంగా ఆమెనే ప్రకటించింది.కీర్తి తన కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి వారిలో సేవలో పాల్గొన్నారు.

అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పెళ్లి గురించి తెలిపారు.వచ్చే నెలలోనే తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. గోవాలో పెళ్లి జరుగుతుందని తెలిపారు. ఇక తాను నటిస్తున్న హిందీ సినిమా కూడా వచ్చే నెలలో విడుదల కానుందని, అందుకే స్వామివారి దర్శనం కోసం వచ్చానని తెలిపారు.

బేబీ జాన్‌ షూట్‌ పనుల్లో కీర్తి ప్రస్తుతం బిజీగా ఉంది. ఈ సినిమాతో ఆమె బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు.వరుణ్‌ధావన్‌ హీరోగా ఇది తెరకెక్కుతుంది.కోలీవుడ్‌ లో విడుదలైన తెరీ రీమేక్‌ గా ఈ సినిమా సిద్దమవుతున్నట్లు సమాచారం.

ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మరో వైపు కీర్తి సురేశ్‌ ఇటీవల తన రిలేషన్‌ షిప్‌ స్టేటస్‌ గురించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. తన స్నేహితుడు ఆంటోనీతో ప్రేమలో ఉన్నట్లు ప్రకటించారు. ఆయనతో కలిసి దిగిన ఫొటోని షేర్‌ చేస్తూ..దాదాపు 15 ఏళ్ల తమ స్నేహబంధం ఇక పై జీవితాంతం కొనసాగనుందని తెలిపారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles