వేద నుంచి వచ్చేస్తున్న మమ్మీజీ పాట!

Saturday, December 7, 2024

బాలీవుడ్ యాక్షన్ హీరో జాన్ అబ్రహాం నటించిన తాజా సినిమా వేదా కేవలం నార్త్‌లోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో భారీ రిలీజ్‌కి రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు నిఖిల్ అద్వానీ డైరెక్ట్ చేయగా, పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రాబోతుంది. ఇటీవల ఈ సినిమా ట్రైలర్ విడుదల కాగా, దానికి సాలిడ్ రెస్పాన్స్ దక్కింది.

యాక్షన్‌   కి ఏ మాత్రం కొదువ లేకుండా ఈ సినిమా వస్తుండటంతో వేదా ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాను తెలుగులోనూ విడుదల చేస్తుండగా, తాజాగా ఈ సినిమాలో నుంచి ‘మమ్మీ జీ’ అనే సాంగ్‌ని చిత్ర బృందం విడుదల చేశారు. అందాల భామ మౌనీ రాయ్ ఈ పాటలో అద్భుతంగా డ్యాన్స్ చేస్తూ కుర్రకారుని ఆకట్టుకుంది. ఈ సినిమాకు మనన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ‘వేదా’ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా, శార్వరి వాఘ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల  చేసేందుకు చిత్ర బృందం రెడీ అయ్యింది.  మరి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాల్సిందే.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles