నాలుగేళ్ల తరువాత సినిమా ప్రకటన!

Sunday, October 13, 2024

వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ సినిమా విడుదలైన నాలుగు సంవత్సరాల తరువాత ఆ మూవీ డైరెక్టర్‌ క్రాంతి మరో సినిమాను ప్రకటించారు. యూనిక్ అండ్ వైడ్ రేంజ్ ఎమోషనన్స్ ఉన్న సినిమాని చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఆయన ఆర్తీ క్రియేటివ్ టీమ్ బ్యానర్‌పై గంటా కార్తీక్ రెడ్డి నిర్మించనున్న తన కొత్త  ప్రాజెక్ట్‌ను ఇప్పుడు ప్రకటించారు.

క్రాంతి మాధవ్ తన తాజా సినిమా కోసం ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్‌ని సిద్ధం చేశారు. ఇది వాస్తవ సంఘటనల స్ఫూర్తితో రెడీ చేసిన కథ అని సమాచారం. ఈ చిత్రానికి DGL అనే ఆసక్తికరమైన టైటిల్‌ పెట్టారు. టైటిల్ పోస్టర్‌లో హీరో తన టీ-షర్ట్‌ని వెనుక నుంచి ఎత్తిపెట్టి డిఫరెంట్ ఫోజ్ లో ఉన్నారు.

కాజీపేట జంక్షన్‌లోని రైల్వే ట్రాక్‌పై నిలబడి ఉండగా, అతని చుట్టూ వివిధ ట్రాక్‌లపై రైళ్లు వెళుతున్నాయి. పోస్టర్‌లో జర్నీ బిగిన్స్ అని రాసుంది. టీమ్ విడుదల చేసిన మరో పోస్టర్‌లో స్నేహితుల గ్యాంగ్ రైల్వే బ్రిడ్జి పైన ఎంజాయ్ చేస్తున్నట్టు ప్రజెంట్ చేస్తోంది. రెండు పోస్టర్‌లు క్యురియాసిటీని పెంచాయి. DGL సినిమా షూటింగ్ నవంబర్ 2024లో ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి టాప్ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు.

జ్ఞాన శేఖర్ వీఎస్ కెమెరా మ్యాన్ గా చేస్తుండగా…. ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ క్లాసిక్ తర్వాత క్రాంతి మాధవ్, జ్ఞాన శేఖర్ VS కలిసి చేస్తున్న రెండో సినిమా ఈ చిత్రం. ఈ సినిమాకి సంబంధించిన ప్రధాన తారాగణంతో పాటు ఇతర టెక్నీషియన్స్‌ల వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేస్తారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles