ఓటీటీ స్ట్రీమింగ్‌ కు వచ్చేసిన మట్కా!

Andhrawatch
1 Min Read

టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ప్రయోగాత్మ సినిమాలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అలా తను చేసిన తాజా సినిమా  “మట్కా”. దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కించిన ఈ భారీ సినిమా విడుదలకి వచ్చింది. కానీ అనుకున్న రేంజ్ లో అయితే విజయాన్ని అందుకోలేదు.

ఇక థియేటర్స్ లో రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫైనల్ గా ఓటీటీ విడుదలకి వచ్చేసింది.ప్రముఖ స్ట్రీమింగ్ యాప్ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు సొంతం చేసుకున్న ఈ సినిమా నేటి నుంచి ఓటీటీలో పాన్ ఇండియా భాషల్లో వస్తుంది. ఇక ఈ సినిమాలో మీనాక్షి చౌదరి అలాగే నోరా ఫతేహి నటించగా జీవీ ప్రకాశం సంగీతం అందించారు. అలాగే వైరా ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.

Share This Article