లక్ష్యం పెద్దదే.. తగ్గేదే లేదంటున్న లోకేష్!

Thursday, March 20, 2025

20 లక్షల ఉద్యోగాలను అయిదేళ్ల వ్యవధిలో యువతరానికి అందుబాటులోకి తీసుకురావడం అంటే మాటలు కాదు. అంతపెద్ద లక్ష్యాన్ని ఊహించుకోవడానికి కూడా నాయకులు భయపడతారు. కానీ నారా లోకేష్ మాత్రం.. ఏమాత్రం వెరపు లేకుండా.. అయిదేళ్ల వ్యవధిలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అనే హామీకి కట్టుబడి ఉన్నాం అంటూ ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు.

పెద్దలు చెబుతూ ఉంటారు. పెద్ద లక్ష్యాలను నిర్దేశించుకో.. టార్గెట్ హై అని అంటూ ఉంటారు. నారా లోకేష్ ఆశావహ దృక్పథంతో వ్యవహరిస్తున్న తీరు ఆ మాటనే గుర్తు చేస్తోంది. 20 లక్షల ఉద్యోగాల కల్పన విషయంలో ఒక్క లోకేష్ మాత్రమే కాదు.. ప్రభుత్వంలోని కీలక నాయకులు అందరూ కూడా స్థిర లక్ష్యంతోనే పురోగమిస్తున్నట్టుగా అర్థమవుతోంది. ఎందుకంటే.. దావోస్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత.. రెండు రోజుల కిందట పరిశ్రమల శాఖ మంత్రి టిజి భరత్ కర్నూలులో విలేకర్లతో మాట్లాడుతూ ఇఃదే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అయిదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పన ఖచ్చితంగా సాధ్యమవుతుందని ఆయన చెప్పారు.

దావోస్ లో ప్రపంచ పారిశ్రామికవేత్తలతో మన రాష్ట్ర ప్రతినిధుల బృందం దాదాపు వందకు పైగా సమావేశాలు జరిపిందని.. వాటిలో సగం సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టినా కూడాచ.. 20 లక్షల ఉద్యోగాల లక్ష్యాన్ని అందుకోగలమని వారు అంటున్నారు.

విశాఖను ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతోంది. అక్కడ గూగుల్ సహకారంతో డేటా సిటీని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. టీసీఎస్ రెండు నెలల్లోనే తమ కార్యకలాపాలు ప్రారంభిస్తుందని అంటున్నారు. ఒక్క టీసీఎస్ వస్తేనే విడతల వారీగా యాభై వేల ఉద్యోగాల కల్పన జరుగుతుందనేది అంచనా. టీసీఎస్ విశాఖకు రావడం సాకారం అయిన తర్వాత.. ఇతరత్రా అనేక ఐటీ కంపెనీలకు కూడా రావాలనే ఆలోచన ఏర్పడుతుందనే నమ్మకం ప్రభుత్వ వర్గాల్లో ఉంది.

పైగా నారా లోకేష్.. రాష్ట్రానికి పెట్టుబడులు సంస్థలను తీసుకురావడం అనేది తన ఫస్ట్ టార్గెట్ అన్నట్టుగా తిరుగుతున్నారు. ఒకప్పట్లో చంద్రబాబునాయుడు హైదరాబాదుకు ఐటీ కంపెనీలను తీసుకురావడానికి అమెరికాలో కాలికి బలపం కట్టుకున్నట్టుగా అన్ని రకాల ఆఫీసులు తిరుగుతూ వారితో చర్చలు జరిపినట్టుగా లోకేష్ ఎక్కడకు వెళ్లినా కొత్త ప్ాజెక్టులను తీసుకురావడం గురించి ప్రయత్నిస్తున్నారు. నాయకులు ఇంతగా కష్టపడుతున్నప్పుడు.. వారు ఆశిస్తున్న 20 లక్షల ఉద్యోగాల కల్పన అనే మైలురాయిని చేరుకోవడం సులభం అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Related Articles

  !!!!!!!!   Hiring content writers   !!!!!!!!!
Contact us : [email protected]

Latest Articles